కరోనా పుణ్యం.. ఆన్​లైన్​ గేమింగ్​ ఇండస్ట్రీకి భలే ఆదాయం.. పబ్జీకి ఎన్నో స్థానమంటే...?

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (23:01 IST)
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్​లైన్​ గేమింగ్​ ఇండస్ట్రీకి మంచి క్రేజ్ వచ్చింది. లాక్​డౌన్​తో చాలామంది ఇంటికే పరిమితమవ్వడం, విద్యార్థులకు సూళ్లు, కాలేజీలు మూతబడటంతో ఎంటర్​టైన్​మెంట్​ కోసం ఆన్​లైన్​ గేమ్స్​ను ఆశ్రయించే వారి సంఖ్య పెరిగింది. 
 
2020 ఏడాదిలో మొత్తం గేమింగ్ మార్కెట్లో కేవలం మొబైల్ గేమ్స్ దాదాపు 50శాతం ఆదాయాన్ని సాధించింది. ఇక పిసి, కన్సోల్ గేమ్స్​ 25% ఆదాయాన్ని సాధించాయి. ఈ లెక్కలే మొబైల్​ గేమ్స్​కు ఉన్న క్రేజ్​ ఏంటో తెలియజేస్తున్నాయి. 
 
ఈ క్రమంలోనే పబ్జీ, ఫ్రీఫైర్​ వంటి గేమ్స్​కు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. 2020లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన టాప్​ 10 మొబైల్ గేమ్స్​లో డౌన్​లోడ్​ చేయబడ్డ మొబైల్​ గేమ్​గా ఎమాంగ్​ ఎస్​ నిలిచింది. ఈ జాబితాలో పబ్జి మొబైల్​ గేమ్​ 2020లో ప్రపంచవ్యాప్తంగా 175 మిలియన్ల డౌన్‌లోడ్‌లను సాధించింది.
 
2019తో పోలిస్తే దీని డౌన్​లోడ్స్​ కొంతమేర పడిపోయినప్పటికీ, దీని క్రేజ్​ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 2020లో భారత ప్రభుత్వం చైనా యాప్స్​ను బ్యాన్​ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పబ్జీ మొబైల్​ యాప్​ను కూడా బ్యాన్​ చేసింది. దీంతో దీని డౌన్​లోడ్స్​ పడిపోయాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు