ప్రీ-పెయిడ్ వినియోగదారులకు వొడాఫోన్‌ మూడు కొత్త ప్లాన్లు

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (18:12 IST)
కరోనా కారణంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా మృతులను తగ్గించేందుకు.. ప్రజలను అప్రమత్తం చేసింది. ఇంకా ఉద్యోగులకు వీలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలంటూ కంపెనీలకు పేర్కొంది. ఇందులో భాగంగా జనతా కర్ఫ్యూకు తర్వాత లాక్ డౌన్‌లో వున్నప్పటికీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేస్తున్నారు. ఇందుకోసం డేటాను బాగానే వినియోగిస్తున్నారు.

ఇందుకోసం టెలికాం రంగ సంస్థలు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. జియో ఇప్పటికే రూ.251తో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి డేటా ఆఫర్ ప్రకటించింది. ఇదే కోవలో బీఎస్ఎన్ఎల్ కూడా డేటా కస్టమర్లకు ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం వాల్యూ యాడెడ్‌ సర్వీసెస్‌' విభాగంలో వొడాఫోన్‌ మూడు కొత్త ప్లాన్లను ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మూడు ప్లాన్లు ఆల్‌రౌండర్‌ ప్యాక్‌లలో భాగం కాదు. ఈ స్పెషల్‌ రీఛార్జ్‌తో ఎలాంటి డేటా లేదా టాక్‌ టైం ప్రయోజనం వినియోగదారులకు లభించదు.

రూ.47, రూ.67, రూ.78 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌లతో కాలర్‌ ట్యూన్‌, సర్వీస్‌ వ్యాలిడిటీ ప్రయోజనాలను అందించనుంది. రూ.67 రీఛార్జ్‌తో 90 రోజులు, రూ.47 రీఛార్జ్‌తో 28 రోజులు, 78 ప్యాక్‌తో 89 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్లు కొన్ని ప్రధాన సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు