వెబ్‌ వాట్సా‌ప్‌కు కూడా బయోమెట్రిక్‌ అథెంటికేషన్ ఫీచర్

శుక్రవారం, 29 జనవరి 2021 (16:00 IST)
డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్‌ను వినియోగించేందుకు ఉపకరించే వెబ్‌ వాట్సా‌ప్‌కు కూడా బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌ ఈ విషయాన్ని గురువారం తన బ్లాగ్‌ ద్వారా వెల్లడించింది. 
 
ప్రస్తుతం వాట్సాప్‌ వెబ్‌ను ఉపయోగించేవారు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే సరిపోతుంది. అయితే.. ఈ విధానం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వాట్సాప్‌ పేర్కొంది. 
 
వాట్సాప్‌ వెబ్‌లోని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసే ముందు.. వినియోగదారుడు తన బయోమెట్రిక్‌ (వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు)ను అందించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, వాట్సాప్‌ కొత్తగా ప్రకటించిన ప్రైవసీ పాలసీ అమలైతే.. ఆ యాప్‌ నిర్వహిస్తున్న పేమెంట్‌ ఫీచర్‌ వాడకాన్ని ఆపేస్తామని సింహభాగం వినియోగదారులు అంటున్నారు. 
 
బీఎం నెక్స్‌ట్‌ అనే సంస్థ 17వేల మంది అభిప్రాయాలు సేకరించగా.. 92శాతం మంది వాట్సాప్‌ పేమెంట్‌ వాడకాన్ని ఆపేస్తామన్నారు. 82% మంది కొత్త పాలసీని వ్యతిరేకించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు