వాట్సాప్ పే సేవలు.. తొలుత 2 కోట్ల మందికే..

సోమవారం, 9 నవంబరు 2020 (12:04 IST)
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారత్‌లో ఇటీవలే డిజిటల్ చెల్లింపుల సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వాట్సాప్ పే సేవలు.. తొలుత 2 కోట్ల మందికే ఈ సేవలు లభిస్తాయి. అయితే వాట్సాప్‌కు ప్రస్తుతం భారత్‌లో 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇక వాట్సాప్ కోసం ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్‌కు లింక్ అయి ఉండే బ్యాంక్ అకౌంట్లను మాత్రమే వాడుకోగలుగుతారు. 
 
ఇక ఇప్పటికే యూపీఐ యాప్స్ ద్వారా నగదు చెల్లింపులు జరుపుతున్న వారు కొత్తగా వాట్సాప్‌లో అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాల్సిన పనిలేదు. ఉన్న యూపీఐ అకౌంట్‌నే వాట్సాప్‌పేకు అనుసంధానం చేసుకోవచ్చు. యూపీఐ పిన్ కూడా పాతదే ఉపయోగపడుతుంది.
 
ఇప్పటి వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు జరపని వారు, కొత్త యూజర్లు వాట్సాప్‌లో కొత్తగా అకౌంట్‌ను క్రియేట్ చేసుకుని యూపీఐ పిన్ సెట్ చేసుకోవడం ద్వారా యూపీఐ చెల్లింపులు జరపవచ్చు. ఇక వాట్సాప్ పే ద్వారా కేవలం భారత్‌లో ఉండే ఫోన్ నంబర్లకు మాత్రమే, అందులోనూ ఇండియన్ బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే నగదును పంపించుకోవచ్చు. విదేశీ బ్యాంక్ అకౌంట్లకు నగదును పంపలేరు.
 
యూపీఐ ద్వారా రోజుకు రూ.1 లక్ష వరకు ఏదైనా యాప్ ద్వారా చెల్లింపులు జరవపచ్చు. అంతే మొత్తంలో నగదును పంపించుకోవచ్చు. సరిగ్గా ఇదే రూల్ వాట్సాప్‌పే కు కూడా వర్తిస్తుంది. రోజుకు రూ. 1 లక్ష వరకు మాత్రమే నగదు చెల్లింపులు లేదా బదిలీలు చేయవచ్చు. 
 
అయితే కొన్ని యూపీఐ యాప్స్‌లలో బ్యాంక్ అకౌంట్ నంబర్‌, ఐఎఫ్ఎస్‌సీ నంబర్‌లను ఎంటర్ చేసి డబ్బు ట్రాన్స్ ఫర్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ వాట్సాప్ పేలో ఆ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు