ప్రస్తుత కాలంలో పిల్లలను పెంచే తల్లిదండ్రులు తప్పకుండా డైపర్లను వాడుతున్నారు. ఇవి అత్యవసర వస్తువుగా మారిపోయింది. ఇంటి వరకైతే పర్లేదు కానీ.. పిల్లలను బయటికి తీసుకెళ్లే తల్లిదండ్రులు డైపర్లను తప్పకుండా వాడుతున్నారు. కానీ కొందరు ఇంట్లో వున్నప్పుడు కూడా పిల్లలకు డైపర్లను వాడటం చేస్తున్నారు. అయితే ఇలా డైపర్లను వాడటం ద్వారా ఏర్పడే హానికరమైన విషయాలు తెలిస్తే ఖంగుతింటారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో డైపర్లు పిల్లక ఆరోగ్యానికి చేటు కలిగిస్తాయి. ఇంకా డైపర్‌లోని పాథ్లెట్ (phthalate) అనే విష రసాయనాలు పిల్లల్లో రక్తపోటు, మధుమేహం, ఒబిసిటీ వంటి సమస్యలకు కారణమవుతాయని పరిశోధనలో తేలింది. దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాల్లో phthalate కలిపిన డైపర్లను నిషేధించడం జరిగింది.