నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు...!

FILE
నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమిగాని తన బల్మిగాదయా
విశ్వదాభిరామ.. వినుర వేమా...!!

తాత్పర్యం :
నీటిలో ఉన్నప్పుడు మొసలి చిన్నది అయినప్పటికీ, చాలా పెద్దదైన ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపేయగలదు. కానీ ఆ మొసలి తన స్థానమైన నీటిని వదలి బయటికి వచ్చినప్పుడు కుక్కచేత కూడా ఓడింపబడుతుంది. కాబట్టి మొసలికి అంత బలం తన స్థానం వల్ల వచ్చినదేగానీ, స్వంత బలము కాదని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి