పశుల వన్నె వేరు పా లేకవర్ణమౌ బుష్పజాతి వేరు పూజ యొకటి దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా విశ్వదాభిరామ.. వినుర వేమా..!
తాత్పర్యం : ఆవుల రంగులు వేరుగా ఉన్నప్పటికీ, పాల రంగు మాత్రం ఒక్కటిగానే ఉంటుంది. అలాగే పువ్వుల రకాలు, రంగులు వేరు వేరుగా ఉన్నప్పటికీ పూజ మాత్రం ఒక్కటే కదా. అలాగే దేవుళ్ళ పేర్లు ఎన్నిరకాలుగా ఉన్నప్పటికీ.. దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని గ్రహించాలని ఈ పద్యం యొక్క భావం.