తాత్పర్యం : దశరథరామా..! నీవు పరమ పదమునందు రాజిల్లుచున్న లక్ష్మీదేవిని ఇచట సీతగా జేసుకుని, అందలి పరివారమెల్ల వీరవైష్ణవ జనులుగా వచ్చి స్తుతించుచుండగా, అచట విరజానది ఇచ్చట గోదావరీగా ప్రవహించగా, ఆ వైకుంఠమే ఇచ్చట భద్రాద్రిగా రాణింపగా, వేంచేసియున్న నీ భక్తులను ఉద్ధరించుచున్న శ్రీ మహావిష్ణుండవే కానీ మరియొక మూర్తివి కానే కావు కదా... మము రక్షింపుము భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి.. అని ఈ పద్యం యొక్క భావం.