తాత్పర్యం : సౌందర్యాది గుణములచే ప్రజలను సంతోషింపజేయుచూ... అధిక పరాక్రమము కలిగిన పరశురాముని ఓడించిన ఓ శ్రీరామా...! ఏ సమయాల్లోనైనా పర స్త్రీలయందు ఆసక్తి లేకుండా, మేఘచ్ఛాయ కాంతిలో నొప్పారుచూ, కాకుత్సవంశమునకు చంద్రుని వంటివాడవై, రాక్షసులను సంహరించుచున్న రామా..! నీకు శతకోటి నమస్కారములు తండ్రీ..! అని ఈ పద్యం యొక్క భావం.