శ్రీకంఠ చాపఖండన..!

శ్రీకంఠ చాపఖండన
పాకారిప్రముఖ వినుత భండన విలన
త్కాకుత్‌స్థవంశమండన
రాకేందుయశోవిశాల రామనృపాలా...?

తాత్పర్యం :
శివుని విల్లు విరచినవాడా..! ఇంద్రాదులు పొగడునట్లుగా రావణుడితో యుద్ధం చేసినవాడా..! కాకుస్థ వంశమును నీ అవతారంచేత అలంకరించినవాడా..! పున్నమిచంద్రుని వెన్నెల వంటి స్వచ్ఛమైన కీర్తి కలిగిన శ్రీరామా..! రుక్మిణీ కళ్యాణ కథ చెప్పుచున్నాను... ఆలకింపుము తండ్రీ...! అని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి