స్థాన బలమేగానీ..!

బుధవారం, 24 డిశెంబరు 2008 (11:46 IST)
నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు దీయు
బైట కుక్క చేత భంగపడును!
స్థానబల్మిగాని తన బల్మి గాదయా
విశ్వదాభిరామ వినుర వేమ..!

తాత్పర్యం :
నీళ్లలో ఉన్న మొసలి చిన్నదైనప్పటికీ ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపగలదు. కానీ ఆ మొసలి తన స్థానమైన నీటి నుంచి బయటకు వచ్చినప్పుడు కుక్క చేత కూడా ఓడింపబడుతుంది. మొసలికి అంతటి బలం.. అది ఉండే స్థానం వల్ల వచ్చినదేగానీ తన స్వంత బలము కాదు అని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి