ఆటలంటే బోలడంత సరదా..!

శనివారం, 13 డిశెంబరు 2008 (11:16 IST)
ఆడాలీ... ఆటలాడాలి... పాడాలీ... పాట పాడాలి
బొంగరాల ఆటంటె... బోలడంత సరదా

గోలీలు గోడంబిల్లలు... గొప్పయిన ఆటలు
ఆడాలీ... ఆటలాడాలి... పాడాలీ... పాట పాడాలి

చింతగింజలు గిరక... చిన్నోలాడే ఆట
ఆడాలీ... ఆటలాడాలి... పాడాలీ... పాట పాడాలి

ఏ ఆటైనా ఏ పాటైనా... ఎంతోచక్కగ ఉంటుంది
ఆడాలీ... ఆటలాడాలి... పాడాలీ... పాట పాడాలి
ఆడాలీ... ఆటలాడాలి... పాడాలీ... పాట పాడాలి

వెబ్దునియా పై చదవండి