ఐదు వ్రేళ్ల బలిమి హస్తంబు పనిచేయు నందొకటియు వీడ బొందిక చెడు స్వీయుడొకడు విడిన జెడుగదా పని బల్మి విశ్వదాభిరామ.. వినుర వేమా..!!
తాత్పర్యం : చేతికి ఐదువ్రేళ్ళూ ఉన్నప్పుడే ఎవరైనా సరే... చేయదలచిన పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆ ఐదు వ్రేళ్ళలో ఓ ఒక్క వ్రేలు లేకుండా పోయినట్లయినా, ఆ చేయి ఎందుకూ పనికిరాదు. అలాగే మనలను ప్రాణసమానంగా ప్రేమించే ఆప్తుల్లో ఒక్కరు, మనల్ని వదలి వెళ్ళిపోయినా... కార్యహాని జరగడమే గాకుండా, జీవితంలో అభివృద్ధిని సాధించడం కూడా చాలా కష్టం అవుతుందని ఈ పద్యం యొక్క భావం.