చంపదగినయట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటె చాలు విశ్వదాభిరామ.. వినురవేమ..!
తాత్పర్యం : విపరీతమైన ద్వేషభావం కలిగినటువంటి శత్రువు మన చేతికి చిక్కినప్పటికీ... వారికి ఎలాంటి అపకారం చేయకుండా, అవసరమైన ఉపకారం చేసి విడిచిపెట్టుట మంచిదని ఈ పద్యం యొక్క భావం.