చిట్టి చిలుకా ఎక్కడున్నావు...?

చిట్టి చిలుకా చిలుకా ఎక్కడున్నావు
చక్కగ ఎగురుతూ పోతున్నావా...?

చిట్టి ఉడుతా ఉడుతా ఎక్కడున్నావు
ఊగుతున్న కొమ్మల్లోన దాక్కున్నావా...?

చిట్టి లేగదూడ నువ్వు ఎక్కడున్నావు
అమ్మ పొదుగులో దాక్కున్నావా...?

చిట్టి పాపా పాపా నువ్వెక్కడున్నావు
కడుపునిండా బువ్వుతిని బజ్జున్నావా...?!!

వెబ్దునియా పై చదవండి