తాత్పర్యం : శ్రీరామునిచే పూజింపబడిన పాదపద్మముల జంటగల ఈశ్వరా...! నీ రూపము తుద మొదలు నేను కనిపెట్టలేను. నీవా నన్ను రమ్మని ఆహ్వానించవు. నిన్నే నమ్మియున్నాను. పాల ముంచిననూ, నీట ముంచిననూ భారము నీదే ఈశ్వరా..! నన్ను తొందరగా కరుణించమని వేడుకొనుచున్నాను అని ఈ పద్యం యొక్క భావం.