పర్వముల సతుల!

మంగళవారం, 14 అక్టోబరు 2008 (11:34 IST)
FileFILE
పర్వముల సతుల గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో,
గర్వింప నాలి బెంపకు,
నిర్వాహము లేనిచోట నిలువకు, సుమతీ...!

తాత్పర్యం :
పుణ్య దినములో స్త్రీలను పొందకూడదు. అలాగే, రాజు యొక్క దయను నమ్మి పొంగకూడదు. భార్యకు గర్వం వచ్చేమాదిరిగా పోషించవద్దు, బాగుపడలేని చోట నివసించవద్దని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి