తాత్పర్యం : శ్రీరామునిచే పూజింపబడిన పాదపద్మముల జంట కలిగిన ఈశ్వరా..! నీ రూపము తుద మొదలు నేను కనిపెట్టలేను. నీవా నన్ను రమ్మని పిలవనూ లేదు. నా ప్రయత్నాలన్నియూ వృధా అయిపోతున్నాయి. అయినప్పటికీ నిన్నే నమ్ముకున్నాను తండ్రీ.. పాల ముంచినా, నీట ముంచినా భారం నీదే ఈశ్వరా..! తొందరగా వచ్చి మమ్మల్ని రక్షించి కటాక్షించమని వేడుకొనుచున్నాము తండ్రీ..! అని ఈ పద్యం యొక్క భావం.