పిల్లలం... బడి పిల్లలం..!

బుధవారం, 17 డిశెంబరు 2008 (12:17 IST)
పిల్లలం మేం బడి పిల్లలం
బుడుగులం మేం పిడుగులం

నింగికి నేలకు నిచ్చెనలేసే
విశ్వ ప్రేమకు వారసులం
బంకమట్టితో కుండలు చేస్తాం
ఇసుకతో మేం కోటలు కడుతాం

రావి ఆకులతో బూరలు చేస్తాం
కొబ్బరాకులతో రాకెట్లు చేస్తాం
వానల్లో మేం గంతులు వేస్తాం
కాగితపు పడవలే సొంపుగ చేస్తాం

కమ్మటి కథలను చెబితే..
రెప్పపాటు వేయకుండా వింటాం
కమ్మగా, హాయిగా నిదురోతాం
పొద్దున్నే లేచి బడికి వెళ్తాం...!

వెబ్దునియా పై చదవండి