రంగు రంగులా రెక్కలతో...!

చిలకలుగాని చిలుకల్లారా
సీతాకోక చిలుకల్లారా..!

రంగు రంగులా రెక్కలతో
సింగారాలు చిందేరా...?

వన్నెల వన్నెల్ పూల మీద
వాలుచున్నారా..?

కన్నుల కన్నుల పండుగ చేస్తూ
కదులుతున్నారా..?

వనమంతా, దినమంతా
వసంత శోభలతో...
అందాల, ఆనందాల ఆటలాడేరా..!

వెబ్దునియా పై చదవండి