పతికడకు, తను గూర్చిన సతికడకును, వెల్పుకడకు, సద్గురు కడకున్ సుతుకడకును రిత్తచేతుల మతిమంతులు చనరు, నీతి మార్గము సుమతీ...!
తాత్పర్యం : నీతి ప్రవర్తన కలిగినటువంటివారు రాజు దగ్గరకు, తనను ప్రేమించిన భార్య దగ్గరకు, దేవుని సన్నిధానానికి, గురువు వద్దకు, కుమారుని దగ్గరకు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళరని ఈ పద్యం సుమతీ శతకకారుడు చెప్పాడు.