నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు దీయు బైట కుక్క చేత భంగపడును! స్థానబల్మిగాని తన బల్మి గాదయా విశ్వదాభిరామ వినుర వేమ..!
తాత్పర్యం : నీళ్లలో ఉన్న మొసలి చిన్నదైనప్పటికీ ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపగలదు. కానీ ఆ మొసలి తన స్థానమైన నీటి నుంచి బయటకు వచ్చినప్పుడు కుక్క చేత కూడా ఓడింపబడుతుంది. మొసలికి అంతటి బలం.. అది ఉండే స్థానం వల్ల వచ్చినదేగానీ తన స్వంత బలము కాదు అని ఈ పద్యం యొక్క భావం.