వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు లెక్కకు మిక్కిలిగా వున్న సంగతి తెలిసిందే. ఇకపోతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించినవారిపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ ఫైర్ అయ్యారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు మాటకి ముందు తాట తీస్తా... తోలు తీస్తా అంటున్నారనీ, ఏంటి ఆయన తీసేది నా బత్తాయి అంటూ సెటైర్లు వేశారు.
తాట తీస్తా... తోలు తీస్తా... అంటూ ఊరకే మాట్లాడుకునే బదులు మీ మేనిఫెస్టోలు గురించి చెప్పుకోండి అంటూ చెప్పారు. మీరు తెల్ల ఖర్చీప్ ఊపినా అది పసుపే అనీ, జనసేన-తెదేపా రెండూ కలిసే వున్నాయని కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడి దగ్గర్నుంచి అందరికీ తెలుసని అన్నారు.