నా బుజ్జి కదూ...!

గురువారం, 6 నవంబరు 2008 (16:36 IST)
పుట్టింటికి పంపలేదన్న కోపంతో రుసరుసలాడుతూ ఇంట్లో పనులన్నింటికీ పుల్‌స్టాఫ్ పెట్టేసింది అర్చన...

ఎక్కడిపనులక్కడే ఉండటంతో, ఆఫీసుకు వెళ్ళే వీలులేక తలపట్టుకు కూర్చున్నాడు సుందరం...

ఎలాగైనా సరే... అర్చన అలక మాన్పించాలనుకున్నాడు. మెల్లిగా ఆమె వద్దకెళ్లి...

"నా బుజ్జి కదూ... నా బంగారం కదూ...! అలక మానవే తల్లీ...!" అంటూ అడుక్కున్నాడు

"సర్లే...! ఇప్పుడే బంగారం అన్నారు కాబట్టి... నాకు బంగారం కొనివ్వాల్సిందే" పట్టుబట్టింది అర్చన

మళ్లీ తలపట్టుకు కూర్చున్నాడు మన సుందరం....!

వెబ్దునియా పై చదవండి