రా చెలీ నాకోసం... రావే సఖీ మన ప్రేమ కోసం...

మంగళవారం, 19 మార్చి 2013 (22:53 IST)
WD

ప్రియా...

యవ్వనపు తొలినాళ్లలో

నిను చూసిన ఆ క్షణాల్లో

నీ రూపు నా హృదయంలో

ముద్రించావు తీపిగురుతుగా

నీ యవ్వనపు అధరామృతం

నీ చెక్కిలి దరహాసం

నీ ముంగురుల మారుతం

గిలిగింతలు పెట్టాయ్ నిజంగా

నీ కౌగిళ్ల కమ్మదనాలు

నీ చూపుల మలయమారుతాలు

నీ నునులేత అందాలు

నాకు నిత్యనూతనాలు

రా చెలీ నాకోసం

రావే సఖీ మన ప్రేమ కోసం

వస్తావుగా ప్రియా మన కోసం

నీకోసం ఎదురుచూస్తూ.....

వెబ్దునియా పై చదవండి