ప్రేమ లోకంలో

Munibabu

శనివారం, 20 సెప్టెంబరు 2008 (17:18 IST)
కడలి అంచున తీరంలా వేచి ఉన్నా...
కెరటమై వచ్చి నను చేరుతావని...

ఎడారి నేలనై ఎదురు చూస్తున్నా...
దాహం తీర్చే చిరు చినుకై నాకు ప్రాణం పోస్తావని...

గుడి గంటనై స్థబ్ధుగా ఉన్నా...
చిరుగాలివై వచ్చి నాతో రాగాలు పలికిస్తావని...

ఆనందం చిగురులనెరగని శిశిరమై వేచి ఉన్నా...
వసంతమై వచ్చి కొత్త లోకానికి నను తీసుకెళ్తావని...

నీవే ఆశగా... నీ తలపులే ప్రాణంగా... బ్రతికేస్తున్నా...
ఏనాటికైనా నువ్వు నన్ను చేరుతావని...

వెబ్దునియా పై చదవండి