తాజాగా 18 మిల్లీ మీటర్ల ఎత్తు, 8 మిల్లీ మీటర్ల వెడల్పుతో ఈ మైక్రో ఆర్ట్ చేశాడు వెంకటేష్. పది గంటల పాటు శ్రమించి అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించానని అంటున్నాడు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెన్సిల్ మొనపై అతి సూక్ష్మంగా శివుడి కళా రూపం చెక్కి ఔరా అనిపించాడు.
తలపై సగం మిగిలిన నెలవంక, మేడలో హారంగా విష సర్పం, చేతిలో త్రిశూలం.. కాలి కింద పులి చర్మం.. ఒంటి కాలుపై శివతాండవం చేస్తున్నట్టు మహాశివుడు నాట్య రూపంలో దర్శనమిస్తున్నాడు. ఈ శిల్పం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
5 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తుతో దీనిని రూపొందించినట్లు తెనాలి మిర్చి స్నాక్స్ నిర్వాహకులు తెలిపారు. తెనాలి పట్టణం చెంచుపేటలోని వ్యాపార కేంద్రం వద్ద దీన్ని ప్రదర్శించడంతో ప్రజలంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు.