మహాశివరాత్రి ఎప్పుడు..? మంగళవారమా? బుధవారమా?

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (10:31 IST)
మహాశివరాత్రి పర్వదినానికి తెలుగు రాష్ట్రాలు ముస్తాబవుతున్నాయి. పరమేశ్వరుడిని నిష్ఠతో పూజించేందుకు ప్రజలంతా సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే మహాశివరాత్రి ఫిబ్రవరి 13న జరుపుకోవాలని కొందరు.. కాదు కాదు బుధవారమే జరుపుకోవాలని కొందరు చెప్తున్నారు. అయితే జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారంటే.. మహాదేవుడు లింగావతారంగా అవతరించిన మహోన్నత రోజునే మహాశివరాత్రి అంటారు. ఆ పర్వదినం ఈ ఏడాది ఫిబ్రవరి 13 అంటే మంగళవారం నాడేనని చెప్తున్నారు. 
 
మాఘ మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ చతుర్దశి ఈ నెల 13న వస్తోంది. మరికొందరి చతుర్దశి తిథి 14న అధిక సమయం వుందని చెప్తూ ఆ రోజే పండగ అంటున్నారు. అయితే లింగోద్భవ పూజలు రాత్రిపూట జరుగుతాయని.. రాత్రిపూట చతుర్దశి మంగళవారమే.. కాబట్టి శివరాత్రి కూడా మంగళవారమేనని ఆధ్యాత్మిక పండితులు చెప్పారు. ఇంకా ఉపవాసం చేసేవారు మంగళవారం పూట చేయాలని వారు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు