కర్నాటక మంత్రులు, ఎమ్మెల్యేల కోసం ఫైవ్‌స్టార్ డీలక్స్ గదులు

గురువారం, 25 జూన్ 2020 (15:15 IST)
కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ప్రతి రోజూ నమోదవుతున్న కొత్త కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పది వేల మార్కును దాటిపోయాయి. అలాగే, ఈ వైరస్ బారినపడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కరోనా రోగుల కోసం బెడ్లు, కనీక సదుపాయాలు లభించక అవస్థలు పడుతున్నారు. 
 
కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు, ప్రభుత్వ అధికారుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైంది. బెంగళూరులో ఇటీవల పునరుద్ధరించిన కుమార కృప అతిథి గృహంలోని వంద డీలక్స్‌ గదులను కరోనా సోకిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం కేటాయిస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వీవీఐపీ అతిథి గృహంలోని లగ్జరీ గదుల భర్తీ 33 శాతం మించకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 
 
ఈ ఆదేశాలపై విపక్ష పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ వైపు కరోనా సోకిన సాధారణ ప్రజలకు దవాఖానలో చోటు, వసతులు లేక అల్లాడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు డీలక్స్‌ గదులను కరోనా కేంద్రాలుగా కేటాయించడాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తమ చర్యను సమర్దించుకున్నది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు