గత యేడాది నవంబరు నెల 27వ తేదీన రన్యారావును జతిన్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత లావెల్లీ రోడ్డులోని ఒక ఖరీదైన ఫ్లాట్‌లో వీరు సంసార జీవితాన్ని మొదలుపెట్టారు. అయితే, నెల రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తాను వద్దన్నా పని ఉందని, వ్యాపారం చేసుకోవాలని ప్రతిసారి ఆమె తరచుగా దుబాయ్‌కు వెళ్లి వస్తుండటంతో ఆమె నుంచి జతిన్ దూరమయ్యాడు.
ఈ క్రమంలో గత మార్చి నెల 2వ తేదీ అర్థరాత్రి రన్యారావును డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. వీరి అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో జతిన్‌ను డీఆర్ఐ అధికారులు విచారించగా, బంగారం స్మగ్లింగ్ కేసులో అతని ప్రమేయం లవేదని తేలడంతో అతన్ని వదిలేశారు. ఈ కేసు నుంచి తన భార్య రన్యారావు బయపడినా ఆమెతో కలిసి ఉండటం సాధ్యపడదని భావించిన జతిన్ ఆమె నుంచి విడాకులు కోరుతున్నారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.