వివరాల్లోకి వెళితే. నార్త్ ముంబైలో జరిగిన ప్రియుడు పుట్టినరోజుకు యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. వెళ్లే సమయంలో తనను ఎవరూ అడ్డుకోకుండా ఇంటికి గొళ్లెం పెట్టింది. ప్రియుడి బర్త్డే పార్టీకి చేరుకుంది. అక్కడ అతని స్నేహితులు, అతను కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల తర్వాత ఆమెకు కడుపులో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది.
అనంతరం తనపై జరిగిన బలాత్కారం గురించి, నిందితుల గురించి వివరించింది. దీనిపై పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఆరుగురిని పట్టుకున్న పోలీసులు.. మరొకరి కోసం గాలిస్తున్నారు. గ్యాంగ్ రేప్ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.