ఇంగ్లీషులో మాట్లాడి వేధిస్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని సాహూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే మహ్మద్ వహిద్ రహీన్ (21), అలామ్ షేక్ స్నేహితులు. వీరిలో రహీన్ పెద్దగా చదువుకోలేదు. అయితే షేక్ చదువుకున్న వాడు.