అల్లు అర్జున్‌ పై బిగ్‌బీ అమితాబచ్చన్‌ ప్రశంసలు

డీవీ

సోమవారం, 9 డిశెంబరు 2024 (17:04 IST)
Allu Arjun, Amitabh Bachchan
'పుష్ప-2'లో తన అద్వితీయ నటనతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను ఇప్పుడు కేవలం ఇండియానే కాదు ప్రపంచ మొత్తం హాట్‌టాపిక్‌గా మారాడు. పుష్పరాజ్‌గా ఆయన నట విశ్వరూపంకు అందరూ జేజేలు పలుకుతున్నారు. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఐకాన్‌స్టార్‌ నటనను అభినందిస్తున్నారు. 
 
పుష్ప-2 సాధిస్తున్న అఖండ విజయంపై స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌బీ అమితాబచ్చన్‌ ట్విట్టర్‌ వేదికగా ఐకాన్‌ స్టార్‌పై ప్రశంసల జల్లులు కురిపించారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ '' మీమ్మల్ని ఎక్కువగా ఇన్‌స్పయిర్‌ చేసిన యాక్టర్‌ ఎవరని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు అల్లు అర్జున్‌ అమితాబ్‌ అని సమాధాన మిచ్చాడు. ఆయన సినిమాలు చూసి పెరిగాను. అందుకే ఆయనంటే ఎంతో ఇష్టం.  అని అన్నాడు అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఆయన వీడియోకు తన స్పందనగా ట్విట్టర్‌లో స్పందించాడు అమితాబ్‌. 
 
ఆయన సోషల్‌ మీడియా వేదికగా '' అల్లు అర్జున్‌ గారు మీ మాటలు నా హృదయానికి చేరాయి. మీరు నా అర్హతకు మించిన కితాబులు ఇచ్చారు. మేమందరం మీ ప్రతిభ, టాలెంట్‌కు అభిమానులం. ఇక మీరు మమ్ముల్ని ఇంకా ఇన్‌స్పయిర్‌ చేయాలి. మీరు ఇలానే విజయాలు సాధిస్తుండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను. అని ట్విట్ఠర్‌లో స్పందించారు అమితాబ్‌. ఇక ఈ పోస్ట్‌ ఈ రోజు ట్విట్ఱర్‌లో ట్రెండింగ్‌గా మారటంతో బన్నీ అమితాబ్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చాడు. '' అమితాబ్‌ గారు మీరు సూపర్‌హీరో మీరు నా గురించి ఇలా మాట్లాడటం ఆనందంగా ఉంది. మీ హృదయం నుండి వచ్చిన ఈ కాంప్లిమెంట్స్‌ ఎప్పటికి గుర్తుంచుకుంటాను. మీ మంచి మనసుకు నా కృతజ్ఞతలు' అంటూ అల్లు అర్జున్‌ స్పందించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు