నేపాల్‌ను భారీ భూకంపం వణికించింది. ఇది భూకంప లేఖినిపై 6.3గా నమోదైంది. ఈ భూప్రకంపనలు భారతదేశ రాజధాని ఢిల్లీలో కూడా కనిపించాయి. అర్థరాత్రి 1.57 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేపాల్ జాతీయ భూకంప కేంద్రం (సిస్మోలజీ సెంటర్) తెలిపింది. కేవలం రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంపం కారణంగా ఓ ఇల్లు కూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇంకా ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది.
కాగా, ఇటీవలి కాలంలో నేపాల్‌లో తరచుగా వరుస భూకంపాలు వస్తున్నాయి. అక్టోబరు 19 ఖాట్మంటులో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే, జూలై 31వ తేదీన 6.0 తీవ్రతో భూకంపం వచ్చింది. గత 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 22 వేల మంది గాయపడిన విషయం తెల్సిందే.