కొడుకు ప్రేమించి మోసం చేసిన యువతిని తండ్రి వివాహం చేసుకున్న సంఘటన కేరళలో చోటుచేసుకుంది. కొట్టాయం జిల్లాలోని తిరునక్కారం గ్రామంలో షాజి అనే వ్యక్తి, అతని కుమారుడు కలిసి జీవిస్తున్నారు. అయితే షాజీ కొడుకు ఓ యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని కూడా ఆమెకు మాటిచ్చాడు. ఇంతలో తన కొడుకు ప్రేమ విషయం షాజీకి తెలిసింది.
ఈ విషయం ఊరంతా తెలియడంతో యువతి కుటుంబ సభ్యులు ఊళ్లో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. యువతి తల్లిదండ్రులు కూడా ఆమెను ఇంటి నుంచి గెంటివేసి, తమకు కూతురు లేదంటూ తెగేసి చెప్పారు. ఇంటి నుంచి గెంటివేయబడి ఆ యువతి ఒంటరి కావడంతో షాజీ తన కొడుకుని, అతని మొదటి ప్రియురాలిని కూర్చోబెట్టి వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడు.
అయినా ఫలితం లేకపోవడంతో షాజీ బాగా ఆలోచించి, యువతికి న్యాయం చేయాలని భావించి ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీనికి ఆమె అనుమతి కూడా తీసుకున్నాడు. అంతేకాకుండా తన ఆస్తిని పూర్తిగా ఆమె పేరిటే రాసిచ్చి కొడుక్కి షాక్ ఇచ్చాడు.