పడకగదిలో పది అడుగుల కింగ్ కోబ్రా.. ఎలా పట్టుకున్నారో చూడండి..

గురువారం, 13 ఆగస్టు 2020 (10:13 IST)
#King Cobra
కొండచిలువలు ఇంట్లోకి ప్రవేశించడం.. ఇంట్లోని వస్తువుల్లో వుండిపోవడం వంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్‌లో ఒకరి ఇంట్లోని పడక గదిలోకి ఏకంగా ఓ భారీ కింగ్‌ కోబ్రా వచ్చింది. దానిని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో బయటికి పరుగులు తీశారు. 
 
తదనంతరం వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. అనంతరం వారు రంగంలోకి దిగి.. కింగ్‌ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు. తరువాత దాన్ని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. 
 
పట్టుబడ్డ కింగ్ కోబ్రా దాదాపు 10 అడుగులకు పైగా ఉందని అధికారులు తెలిపారు. ఆ పామును పట్టుకుంటుండగా వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్లు జాగ్రత్త అంటూ ఆ కుటుంబ సభ్యులకు సూచిస్తున్నారు.

A #King Cobra rescued by Forest Department's Rapid Response Team from a house at Nainital!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు