అదీ మనలాంటిదేనంటూ కొండముచ్చుకు స్టీరింగ్ ఇచ్చిన బస్సు డ్రైవర్

శనివారం, 6 అక్టోబరు 2018 (18:20 IST)
ఈమధ్య కొంతమంది డ్రైవర్లు ప్రయాణికుల జీవితాలతో ఆడుకుంటున్నారు. విమానాల్లో అప్పుడప్పుడు కొందరు పైలెట్లు కాక్‌పిట్ లోకి వేరేవారిని అనుమతించిన వార్తలు విన్నాం. కానీ ఇక్కడ మాత్రం మనుషులను కాదు ఏకంగా స్టీరింగును కొండముచ్చుకు అప్పగించేశాడు డ్రైవర్. దానితో బస్సులో వున్నవారంతా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని గడగడ వణికిపోయారు.
వివరాల్లోకి వెళితే... కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓ బస్ డ్రైవర్ బస్సు నడుపుతూ వున్న సమయంలో ఓ కొండముచ్చు గబుక్కున అతడి వద్దకు వచ్చింది. అంతేకాకుండా అది స్టీరింగ్ మీద ఎక్కి కూర్చుంది. దీనితో భయపడిన ప్రయాణికులు బస్సును ఆపాలని కోరారు. కానీ అతడు మాత్రం అదేమీ పట్టించుకోలేదు. తాపీగా కొండముచ్చుకు ఆ స్టీరింగ్ ఇచ్చేసి... ఇది కూడా మనలాంటిదే... దానిక్కూడా బుర్ర వుంది అంటూ ఇంకా ఏదేదో మాట్లాడుతూ బస్సు నడిపాడు. ఇది కాస్తా బస్సులో వున్న ప్రయాణికుడు వీడియో తీసి నెట్లో పెట్టేశాడు. 
 
డ్రైవర్ తీరును చూసిన అధికారులు అతడిని తక్షణమే విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. చూడండి ఈ వీడియోలో...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు