అభినందన్ ఫిట్‌నెస్ సాధించాల్సిందే.. మరోసారి దూకాల్సి వస్తే.. లేకుంటే వీల్ ఛైర్‌లో?

సోమవారం, 4 మార్చి 2019 (19:09 IST)
వింగ్ కమాండర్ అభినందన్.. తనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయండంటూ అభ్యర్థించిన సంగతి తెలిసిందే. త్వరలో తాను విధుల్లోకి చేరాలని ఆయన తెలిపారు. అయితే ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా అభినందన్ ఫిట్‌నెస్ గురించి మాట్లాడారు. ఫిట్ అయ్యేంత వరకు వేచి చూస్తామని.. విమానం నడపాలంటే ఫిట్‌నెస్ చాలా అవసరమని ధనోవా చెప్పుకొచ్చారు.
 
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న అభినందన్ మొదట పూర్తిస్థాయి ఫిట్ నెస్ అందుకోవాలని, ఆ తర్వాతే యుద్ధ విమాన బాధ్యతలు అప్పగించే విషయం ఆలోచిస్తామని చెప్పారు. ఒక్కసారి అభినందన్ పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధిస్తే కాక్‌పిట్‌ను అధిరోహిస్తాడని వెల్లడించారు. పూర్తి ఫిట్‌నెస్‌‍తో లేకుండా మరోసారి ఇలా దూకాల్సి వస్తే ఆ దేవుడు కూడా కాపాడలేడు. 
 
ఫిట్‌నెస్ లేకుండా విమానం నుంచి ఎజెక్ట్ అయితే మాత్రం శేష జీవితాన్ని వీల్ చెయిర్‌లో గడపాల్సి ఉంటుంది. అందుకే అభినందన్ విషయంలో తొందరపడటం లేదని మార్షల్ స్పష్టంగా వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు