విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తొలి ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ ప్రారంభం

సెల్వి

సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (10:12 IST)
Floating bridge
కేరళలోని త్రిస్సూర్‌లోని చవక్కడ్ బీచ్‌లో ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ (ఎఫ్ఎస్‌బి) ప్రారంభించబడింది. ఈ టూరిజం స్పాట్ ప్రస్తుతం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అలాగే తాజాగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో తేలియాడే వంతెనను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. 
 
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ. 1.6 కోట్ల పెట్టుబడితో నిర్మించిన వంతెనను ఆదివారం రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌లు ప్రారంభించారు.
 
ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ ఆర్కే బీచ్‌లోని కుర్సురా సబ్‌మెరైన్ మ్యూజియం సమీపంలో ఉంది. కేరళలోని త్రిసూర్‌లోని చవక్కాడ్ బీచ్‌లో ఉన్న వంతెన తరహాలో దీనిని రూపొందించారు. 
 
ఈ బ్రిడ్జి ద్వారా పర్యాటకులు సముద్రంలోకి 100 మీటర్లు నడవవచ్చు. ముంబైకి చెందిన సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌ను ఇన్‌స్టాల్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు