మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హో మంత్రి అరెస్టు

మంగళవారం, 2 నవంబరు 2021 (09:26 IST)
మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ వ్యవహారంలో ఆయన వద్ద 12 గంటలకుపైగా విచారణ జరిపిన తర్వాత అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. విచారణ తర్వాత అతన్ని అరెస్టు చేసి మంగళవారం కోర్టు ముందు హాజరుపర్చింది. 
 
అనిల్‌ను ఈడీ కస్టడీ రిమాండ్‌ కోరనుంది. ఈడీ విచారణకు హాజరు కావాలని కోరుతూ పలు సమన్లు జారీ చేసినా అనిల్ దాటవేశారు. ఎట్టకేలకు దర్యాప్తు అధికారుల ముందు హాజరైన అనిల్ దేశ్‌ముఖ్‌ను ప్రశ్నించే సమయంలో సహకారం అందించని కారణంగా అతన్ని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు చెప్పారు. అరెస్టుకు ముందు మాజీ మంత్రి స్టేట్మెంట్‌ను ఈడీ రికార్డు చేసింది. 
 
కాగా, రూ.100 కోట్ల అక్రమాల రాకెట్‌కు సంబంధించి అనిల్ దేశ్ ముఖ్ పై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ విచారణ జరుపుతోంది. ముంబైలోని హోటళ్లు, బార్‌ల నుంచి ప్రతి నెలా రూ.100 కోట్లు వసూలు చేయమని తొలగింపునకు గురైన అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజ్‌ను అనిల్ దేశ్‌ముఖ్ అడిగారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు