వెస్ట్ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మారి భయపెడుతున్నప్పటికీ రెండు రాష్ట్రాల్లోనూ తొలి దశలో భారీగా పోలింగ్ నమోదు కాగా.. రెండో దఫాలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తే అవకాశాలు ఉన్నాయి.
పలు కీలక స్థానాలపై ఆసక్తి నెలకొంది. బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ, సువేందు అధికారి మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ - వామపక్షాలు - ఐఎస్‌ఎఫ్ కూటమి తరపున సీపీఎం నుంచి యువ నేత మీనాక్షి ముఖర్జీ బరిలో ఉన్నారు.