అస్సాంలో 20 ఏళ్ల బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం.. ఫోన్‌లో రికార్డ్

శనివారం, 6 మే 2023 (14:15 IST)
అస్సాంలో 20 ఏళ్ల యువతిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు.. ఈ అకృత్యాన్ని మొబైల్ ఫోనులో రికార్డ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. 
 
అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలోని గోహ్‌పూర్ ప్రాంతానికి చెందిన బాధితురాలు గత రాత్రి ఐదుగురు నిందితులపై ఫిర్యాదు చేసింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని.. దీన్ని ఫోనులో రికార్డ్ చేశారని తెలిపింది. 
 
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు అరెస్ట్ చేశారు. విచారణలో ప్రధాన నిందితుడు పోరంసద్‌గౌర బాసుమతరీ అనే వ్యక్తి బాలికను తన కారులో తీసుకెళ్లి, తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు