అసలైన ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే వీడే స్వామి.. ఏమి చేసాడో చూడండి..

సోమవారం, 1 ఏప్రియల్ 2019 (15:34 IST)
సాధారణంగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తుండగా హఠాత్తుగా వర్షం వస్తే ట్రాఫిక్ పోలీసులు ఎవరైనా తడవకుండా ఉండేందుకు ఏ చెట్టు కిందకో, రోడ్డు పక్కకో పరుగులు తీస్తారు. అయితే ఓ కానిస్టేబుల్ మాత్రం కుండపోత వర్షంలోనూ డ్యూటీ చేస్తూ ఉద్యోగంపై తనకున్న ప్రేమను చాటాడు. అసోం రాష్ట్రంలోని గౌహతి నగరంలో భారీ వర్షం కురిసింది.
 
ఆ సమయంలో బసిస్థ చరియాలి ట్రాఫిక్ పాయింట్ వద్ద మిథున్ దాస్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణ పనుల్లో నిమగ్నమయ్యారు. రోడ్డు మధ్యలో ఎలాంటి రూప్‌టాప్ లేని స్థలంలో నిలబడి.. వర్షంలో తడుస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేసారు. వర్షాన్ని పట్టించుకోకుండా విధులు నిర్వర్తించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

#WATCH A traffic police constable Mithun Das, continues his duty during a rainstorm at Basistha Chariali Traffic point in Assam's Guwahati. (31-03-2019) pic.twitter.com/HUtyeoaKUD

— ANI (@ANI) April 1, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు