దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనంతో వాహనాల అమ్మకాలు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. వాహనాల కొనుగోలు వ్యయం పెరుగుదల, బీమా వ్యయం పెరగడం, అధిక వడ్డీ రేట్లు, లిక్విడిటీ సమస్య, ధరల పెంపు వంటి అంశాల కారణంగా అమ్మకాలు తగ్గాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.