మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చి యువతిపై రేప్ చేసిన దొంగ బాబా

శనివారం, 7 అక్టోబరు 2017 (10:36 IST)
గోవాలో 19ఏళ్ల యువతికి మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి ఓ అతిథి గృహానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు మరో దొంగ బాబా.  వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సింధు దుర్గ్ జిల్లా అచ్రా పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతి గోవా రాష్ట్రంలోని వాస్కో నగరానికి వచ్చింది. 
 
కర్ణాటక రాష్ట్రంలో స్వయం ప్రకటిత బాబా అనుచరుడైన సంతోష్ కుంభార్ అనే వ్యక్తి యువతిని తన స్వస్థలంలో వదిలిపెడతానంటూ కారులో ఎక్కించుకొని తీసుకువెళుతూ దారి మధ్యలో మత్తుమందు కలిపిన పానీయాన్ని ఆమెతో తాగించాడు. 
 
యువతి మత్తులోకి జారుకున్నాక వాస్కో నగరంలోని ఓ అతిథి గృహానికి తీసుకెళ్లారు. కుందాపూర్ బాబాకు అప్పగించారు. బాబా తనపై అత్యాచారం చేశాడని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడైన కర్ణాటక బాబా కోసం గాలింపు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు