ప్రేమిస్తున్నానని వేధించిన ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. ప్రేమించిన అమ్మాయి ప్రేమకు అంగీకరించకపోవడంతో పాటు ఆమెకు నిశ్చితార్థం కూడా ఖాయం కావడంతో.. గొంతు కోసి హత్య చేశాడు. ఆపై అతడు కూడా పురుగుల మందు తాగాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలం నెమలిపేటలో చోటుచేసుకుంది.