పెళ్లికూతురిని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కిడ్నాప్ చేశారు. ఆపై ఆమెను అత్యంత కిరాతకంగా తల నరికి మొండాన్ని మాత్రమే మిగిల్చారు. బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా ద్వారక బిగాహా గ్రామానికి చెందిన ఓ 19ఏళ్ల యువతికి నీర్‌పూర్ గ్రామానికి చెందిన ఆజాద్ కుమార్ అనే యువకుడితో పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు.