ప్రియుడితో కలిసివుండేందుకు సొంతిల్లు నిర్మించుకోవాలని కన్నబిడ్డ కిడ్నాప్!!

ఠాగూర్

సోమవారం, 3 మార్చి 2025 (09:44 IST)
తాను ప్రేమించిన ప్రియుడుతో కలిసి వుండేందుకు వీలుగా సొంతంగా ఓ ఇంటిని నిర్మించుకోవాలన్న దురాశతో పేగు తెంచుకుని పుట్టిన బిడ్డనే ఓ కన్నతల్లి కిడ్నాప్ చేసింది. మాతృత్వపు ప్రేమను మరిచిపోయి ఈ పాడుపనికి పాల్పడిన ఆ మహిళ ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రంలోని ఛప్రా జిల్లాకు చెందిన 13 యేళ్ల బాలుడు ఆదిత్య కుమార్ ఇటీవల కిడ్నాప్‌కు గురయ్యాడు. రూ.25 లక్షల డబ్బు ఇవ్వకపోతే బాలుడుని చంపేస్తామని బెదిరించాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులకు... కన్నతల్లిపైనే అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని వెల్లడించింది. తన కుమారుడుని కిడ్నాప్ చేసింది తానేనంటూ అంగీకరించడంతో పోలీసులు నివ్వెరపోయారు. 
 
తన ప్రియుడు నితీశ్ కుమార్‌తో కలిసి ఉండేందుకు వీలుగా సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకున్నానని, అందుకు కావాల్సిన డబ్బు కోసం తాను తన కుమారుడినే కిడ్నాప్ చేయించానని బబిత పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. పైగా, ఆమె ఇచ్చిన సమాచారంతో ప్రియుడు నితీశ్ కుమార్‌ను కూడా అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు