బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో గత నెలలో జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన ప్రియుడుతో కలిసి కట్టుకున్న భార్యే.. భర్తను హతమార్చినట్టు తేలింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, వైశాలి జిల్లాలోని భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్హరి రాజ్‌పుతాన్ తోలాకు చెందిన నితేశ్ కుమార్ (25) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది.
నితేశఅ కుమార్ అనే వ్యక్తి నేహా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే గత నెల 20వ తేదీన మహాకుంభమేళాకు నితేశ్ కుమార్ తల్లి వెళ్లింది. నితేశ్ కుమార్ విధులకు వెళ్ళాడు. ఈ క్రమంలో నేహా తన ప్రియుడు విశాల్‌ను ఇంటికి పిలిచి శారీరకంగా కలిసింది. అదేసమయంలో భర్త నితేశ్ ఇంటికి రాగా, భార్య నేహా తన ప్రియుడుతో అభ్యంతరంగా కనిపించారు. భార్యను అలా చూడటంతో నితేశ్ కుమార్‌కు కోపం కట్టలు తెంచుకుంది. విశాల్‌తో గొడవపడ్డాడు. ఆ తర్వాత తన ప్రియుడుతో కలిసి భర్తను నేహా కుమారి హత్య చేసి, మృతదేహాన్ని ఆ రాత్రికి తమ ఇంటికి సమీపంలో ఉన్న బావిలో పడిసింది.
మరుసటి రోజు ఏమీ తెలియనట్టుగా తన భర్త కనిపించడం లేదంటూ ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషించారు. ఇందులో అదే గ్రామానికి చెందిన విశాల్‌తో కొంతకాలంగా ప్రేమిస్తున్నట్టు తేలింది. హత్య జరిగిన రాత్రి వారిద్దరూ శారీరకంగా కలిసినట్టు నిర్ధారించారు. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.