ఈ నేపథ్యంలో గురువారం బెంగాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, 'దేశ ప్రజల డేటాకు భద్రత కల్పించడానికి చైనా యాప్‌లను నిషేధించాం. భారత్ శాంతికాముక దేశం. అయితే, మన దేశంపై ఎవరి కన్ను పడినా వారికి గట్టిగా బుద్ధి చెబుతాం' అని చెప్పారు.
గాల్వన్ లోయ వద్ద చైనా దుందుడుకు చర్యలకు ప్రతిగా తీసుకున్న ఈ చర్యను రవి శంకర్ ప్రసాద్ డిజిటల్ స్ట్రయిక్‌గా అభివర్ణించారు. చైనా యాప్‌లను నిషేధిస్తూ తీసుకున్న చర్యలను ఇటీవల కొన్ని మీడియా సంస్థలు కూడా డిజిటల్ స్ట్రయిక్‌గా పేర్కొన్న విషయం తెలిసిందే. పాక్‌లోని ఉగ్రమూకలపై గతంలో భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిన విషయం తెలిసిందే.